nitin gadkari: మనోహర్‌ పారికర్‌ గోవాకు కాబోయే ముఖ్యమంత్రి: ప‌రోక్షంగా చెప్పిన‌ నితిన్‌ గడ్కరీ


రక్షణశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తోన్న మనోహర్‌ పారికర్ అంత‌కు ముందు గోవాకు ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. అయితే, వ‌చ్చే నెల గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో త‌మ‌ భార‌తీయ జ‌న‌తా పార్టీ గెలిస్తే మ‌ళ్లీ మ‌నోహ‌ర్ పారిక‌రే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పరోక్షంగా చెప్పారు. ప్ర‌స్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్ర‌చారంలో పాల్గొంటోంది.

ఆ రాష్ట్ర‌ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే ఢిల్లీలో ఉన్న ఒక నేత సీఎం అవుతారని నితిన్ గ‌డ్క‌రీ మీడియాకు తెలిపారు. కొత్త‌గా శాస‌న‌సభ‌కు ఎన్నిక‌య్యే నేత‌లే వారి సీఎం ఎవ‌రో నిర్ణయిస్తారని అన్నారు. ఢిల్లీ నుంచి తాము సీఎం అభ్యర్థిని పంపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. మ‌నోహ‌ర్‌ పారికర్ మళ్లీ గోవా రాష్ట్ర రాజకీయాల్లోకి వ‌స్తార‌ని, ఈ అంశంపై త‌మ అధిష్ఠానం కూడా అనుకూలంగా ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా కూడా ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News