GodavariUS: సంక్రాంతి కానుక‌గా ఫ్రేమింగ్ హామ్ కు గోదావ‌రి అరంగేట్రం


Press Note: తెలుగు వారి ఆనందోత్సాహాల పండుగ‌ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14, 2017న ద‌క్షిణ భార‌త‌దేశ‌పు ఆత్మీయ రుచుల రెస్టారెంట్ “గోదావ‌రి”  ఫ్రేమింగ్ హామ్, మ‌సాచుసెట్స్ లో అరంగేట్రం చేయ‌నుంది. బామ్మ చేతి రుచుల‌నుకోల్పోతున్న వారిని, భార‌తీయ వంట‌కాలకు దూరమైన  ప్ర‌వాసీయుల‌ను త‌న మైమ‌ర‌పించే రుచుల‌తో ఆక‌ట్టుకోనుంది.
 
అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ఇపుడు ఫ్రేమింగ్ హామ్ లో అట్ట‌హాసంగా ప్రారంభం కానుంది. అత్యున్న‌త బ్రాండ్ న్యూ రెస్టారెంట్ ను ఫ్రేమింగ్ హామ్, మ‌సాచుసెట్స్ లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14, 2017న ప్రారంభోత్స‌వం కానుంది.
 
మ‌సాచుసెట్స్ లో ద‌క్షిణ భార‌త‌దేశ‌పు ఆత్మీయ రుచుల రెస్టారెంట్  “గోదావ‌రి” కి ఇది రెండో ఆతిథ్య కేంద్రం. గోదావ‌రి ఆవిర్భ‌వించింది సైతం మ‌సాచుసెట్స్ లోనే కావ‌డం విశేషం.
 
గోదావ‌రి ఫ్రేమింగ్ హామ్ (The Golden Triangle - Massachusetts) వింటేజ్ స్టైల్ రూపంలో కొలువుదీర‌నుంది. అంతేకాకుండా కీల‌క‌మైన సంస్థ‌ల‌కు కొద్ది అడుగుల దూరంలోనే ఉంది. స్టాప్‌ల్స్ ఐఎన్‌సీ, బోస్ మ్యూజిక్‌, బీజేస్ హోల్సేల్ క్ల‌బ్, సూప‌ర్ స్టాప్&షాప్‌, టీజే మ్యాక్స్‌, ఐడీజీ, డిస్ర‌ప్ట‌ర్ బీమ్‌, బ్రేయ‌ర్స్‌, లెగ్గ‌ట్ మెక్ కాల్‌, ది అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్, ది అమెరిక‌న్ కేన్స‌ర్ సొసైటీ, నాటిక్ మాల్‌, బోస్ట‌న్ సైంటిఫిక్ వంటి ప్ర‌ముఖ సంస్థ‌లతో పాటుగా మ‌రోడ‌జ‌నుకు పైగా దిగ్గ‌జ కార్పొరేట్ కంపెనీలు గోల్డెన్ ట్ర‌యాంగిల్ కు స‌మీపంలో, చుట్టూతా కొలువుదీరి ఉన్నాయి. త‌ద్వారా వీట‌న్నింటికీ గోదావ‌రి సైతం అతి చేరువ‌లో ఉంది.
 
మ‌సాచుసెట్స్‌లోనే అతిపెద్ద దేవాల‌యం అయిన‌ "శ్రీ క్ష్మీ దేవాలయం" (Sri Lakshmi Temple, Ashland) నుంచి స్వ‌ల్ప దూరంలోనే గోదావ‌రి ఉంది. కీల‌క‌మైన స్థానంలో ఉండ‌టంతో పాటు ఆత్మీయ రుచుల‌కు చిరునామాగా పేరుప్ర‌ఖ్యాత‌లు గ‌డించ‌డం వ‌ల్ల గోదావ‌రి తప్ప‌కుండా భార‌తీయుల‌తో పాటుగా ఇత‌రుల్లో కూడా ఫేవ‌రెట్ రెస్టారెంట్ అనే పేరును సంత‌రించుకోనుంది.
 
గోదావ‌రి అట్ట‌హాసంగా ప్రారంభం అవుతున్న సంద‌ర్భంగా నోరూరించే బ‌ఫెట్‌తో గోదావ‌రికి చెందిన వినూత్న‌మైన బ్రాండ్ న్యూ రుచులు, సంక్రాంతి ప్ర‌త్యేక వంట‌కాలు అతిథుల‌ను ఆక‌ర్షించ‌నున్నాయి. ‘సంక్రాంతి గారెలు’, ‘పెస‌ర పూదీన’ పునుగులు’, ‘జ‌ల్లిక‌ట్టు జీడి దోశ’, ‘పైనాపిల్ ర‌సం’, ‘ధోనీ దొండ‌కాయం మాంసం కూర’‌, ‘వెల్లుల్లి పీత‌ల పులుసు’, ‘పందెం కోడి ఇగురు’ వంటి వాటితో పాటు మ‌రెన్నో గ్రామ‌సీమ‌ల అథెంటిక్ రుచులు సిద్ధంగా ఉండ‌నున్నాయి.
 
గోదావ‌రి ఫ్రేమింగ్ హ‌మ్‌లో ల్లు కంపౌండ్ పేరుతో అద్భుత‌మైన బార్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశీ డ్రింక్స్ అయిన ‘సారా మొజిటో’, ‘రేవు కింద ర‌మ్‌’, ‘జ‌బ‌ర్ద‌స్త్ జిన్’ వంటి వాటితో పాటు అనేక దేశీకాక్ టెయిల్స్ ను రిలాక్స్‌గాఆస్వాదించేందుకు ఈ మధుశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
 
గోదావరి బ్రాండ్ ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ద‌క్షిణ భార‌త‌దేశ‌పు వంట‌కాల‌ను శుభ్ర‌త‌, నాణ్య‌త‌, ఆత్మీయ‌త‌, నోరూరించే రుచితో అందిస్తున్న గోదావ‌రిని వేల మైళ్ల దూరంలో కూడా ఇంత‌గా ఆద‌రిస్తున్నవారంద‌రికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
 
గోదావ‌రి గ్రూప్ ను యువ‌కులు, ఉత్సాహ‌వంతులైన ఆంట్ర‌ప్రెన్యూర్స్ నిర్వ‌హిస్తున్నారు. ద‌క్షిణ భార‌త‌దేశ‌పు వంట‌కాల‌ను అథెంటిక్ గా అందించడంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గోదావ‌రిని ఏకైక చిరునామాగా తీర్చిదిద్దేందుకు ఈ బృందంనిరంతరం శ్ర‌మిస్తోంది.
 
“గోదావ‌రి ప్ర‌స్థానం ప్రారంభ‌మైన చోటుకు మేం మ‌రోమారు వ‌చ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముందడుగు ప‌ట్ల మేం ఎంతో ఆనందంగా ఎందుకు ఉన్నామంటే సంక్రాంతి సంద‌ర్భంగా భోజ‌న ప్రియుల‌ను మ‌రోమారుఅల‌రించే ప్ర‌త్యేక అవ‌కాశం గోదావ‌రి రూపంలో మాకు దొరికింది. గోదావ‌రి పేరుతో ఉన్న కేంద్రాల సంఖ్య కంటే... మేం అందిస్తున్న రుచిక‌ర‌మైన వంట‌కాలు, ఆత్మీయ‌మైన ఆహారం, అథితుల ప్ర‌శంస‌లు, మేం గ‌డించిన అనుభ‌వంమాకెంతో సంతోషాన్ని  ఇస్తోంది” అని నార్త్ ఈస్ట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌, గోదావ‌రి షికాగో య‌జ‌మాని వ‌రుణ్ మేడిశెట్టి హ‌ర్షం వ్యక్తం చేశారు.
 
“గోదావ‌రి రూపంలో మాకు ద‌క్షిణ భార‌త‌దేశ‌పు వంట‌కాలు, రుచుల ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌పంచానికి చాటే ప్ర‌త్యేక అవ‌కాశం దొరికింది. ఇదంతా గోదావ‌రి కుటుంబం స‌మష్టి కృషి ఫ‌లితం. మేమంతా ఒకరికి ఒక‌రుగా ఐక్యంగా క‌లిసి ముందుకుసాగుతున్నాం.” అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
 
“గోదావ‌రి ద్వారా మా ప్ర‌యాణం కొనసాగ‌డం ఆధ్యంతం ఆహ్లాద‌క‌రంగానే కాకుండా ఎంతో ఉత్సాహ‌వంతంగా కూడా  ఉంది.  ఒక కేంద్రానికి అధిప‌తులుగా మాత్ర‌మే కాకుండా మేమంతా ఒక కుటుంబ స‌భ్యులుగా ముందుకుసాగుతున్నాం” అని అజ‌య్ వేముల‌, అజయ్ క‌న్య‌ధార స్ప‌ష్టం చేశారు. గోదావ‌రి న్యూ యార్క్ ప్రారంభోత్సవం నుంచి వారంతా గోదావ‌రితో అనుసంధానం అయి ముందుకు సాగుతున్నారు.
 
గోదావ‌రి చార్లెట్టె ఇటీవ‌లి కాలంలో గోదావ‌రి కుటుంబంలో చేరిన వేదిక‌. చార్లెట్టెలోనే అత్యంత భారీ రెస్టారెంట్ అయిన గోదావ‌రి చార్లెట్టె గ్రాండ్ ఓపెనింగ్  ట్రైల‌ర్ లింక్ ఇదిః https://www.youtube.com/watch?v=roXRYh01iys
 
2017లో గోదావ‌రి శ‌ర‌వేగంగా విస్త‌రించ‌నుంది. ఆ న‌గ‌రాలు కోలంబస్, ఓహియో| బ్లూమింగ్ ట‌న్, ఇల్లినాయిస్‌|, లాస్ ఎంజెలిస్‌, కాలిఫోర్నియా| నాస్ విల్లే, టెన్నెసీ| హ‌రీస్ బ‌ర్గ్‌, పెన్సిల్వేనియా&డెట్రాయిట్ మిచిగాన్ త‌దుప‌రి విస్త‌ర‌ణకేంద్రాలుగా గోదావ‌రి నిర్ణయించుకుంది.
 
భోజ‌న ప్రియుల కోసం గోదావ‌రి మ‌రింతగా చేరువ కానుంది. బోస్ట‌న్ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా త‌మ కార్య‌క‌లాపాల‌ను మ‌రింత‌గా విస్త‌రించ‌నుంది. న్యూ ఇంగ్లాండ్ ఏరియాలోనే అతిపెద్దదిగా బోస్ట‌న్ రెస్టారెంట్‌ను తీర్చిదిద్ద‌నుంది.
 
టీం గోదావ‌రి  భోజ‌న ప్రియుల‌ను ఎన్నెన్నో కొంగొత్త రుచుల ఆలోచ‌న‌ల‌తో, ఆశ్చ‌ర్యాల‌ను అందించడంతో నూత‌న సంవ‌త్స‌ర సంద‌ర్భంగా విశేషంగా అల‌రించింది.
 
మీకు ఆత్మీయ ఆహ్వానం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
గోదావరి ఫ్రేమింగ్ హామ్
1656 వార్సెస్టర్ రోడ్,  
ఫ్రేమింగ్ హామ్‌, సాచుసెట్స్‌ - 01702.
 
మ‌రోమారు ఆత్మీయ ధ‌న్య‌వాదాలు. మా నోరూరించే రుచుల‌ను మ‌మ్మల్ని ఆహ్లాద‌ప‌రిచాయ‌ని భావిస్తున్నాం.
 
చేసి సంప్రదించండి
శ్రీ ఉద‌య్ జి
201-381-7494
[email protected]
www.GodavariUS.com

 
Press note released by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News