barnala: పంజాబ్ మాజీ సీఎం సూర్జిత్‌సింగ్ బర్నాలా మృతి
అనారోగ్యంతో బాధపడుతున్న ఏపీ మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ సీఎం సూర్జిత్‌సింగ్ బర్నాలా(91) ఈ రోజు కన్నుమూశారు. ఏపీతో పాటు తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులకు కూడా ఆయన గవర్నర్‌గా పనిచేశారు. అక్టోబర్ 21, 1925లో హరియాణాలోని అటేలీలో జన్మించిన ఆయనలో దేశభక్తి ఎక్కువే. గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారు. తొలి కాంగ్రెసేతర సర్కారును నెలకొల్పిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశారు. ఆయన మరణం పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సంతాపం తెలిపారు.