ap dgp: సీసీ కెమెరాల సాయంతో ప‌ట్టుకుంటాం.. విగ్రహం, ఫ్లెక్సీల‌ను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు: ఏపీ డీజీపీ


విజయవాడలోని సింగ్ నగర్ లో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని పలువురు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక ఏపీలో ప‌లుచోట్ల సినీన‌టులు, రాజ‌కీయ నాయ‌కుల‌ ఫ్లెక్సీల‌ను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావు మీడియాతో మాట్లాడారు. విగ్రహం కూల్చివేత ఘటనపై విచారణ చేపడుతున్నామ‌ని చెప్పారు. శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడే విష‌యంలో రాజీ ప‌డ‌బోమ‌ని అన్నారు. విగ్ర‌హాలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తిస్తామ‌ని తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చరించారు. ప్ర‌తిఫ్లెక్సీకి భ‌ద్ర‌త ఏర్పాటు చేయ‌డం కుద‌ర‌దని, అంత‌మంది పోలీసులు కూడా లేర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News