trump wiskey: అమాంతంగా పెరిగిపోయిన‌ ట్రంప్‌ బ్రాండ్ ఇమేజ్... ‘ట్రంప్‌ విస్కీ బాటిల్’ రూ.5 ల‌క్ష‌లు


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న డొనాల్డ్‌ ట్రంప్ ఇమేజ్ విప‌రీతంగా పెరిగిపోయింది. 2012లో ట్రంప్‌ పేరుతో తయారైన ఓ విస్కీ బాటిల్‌ను వేలం వేయ‌గా అది రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో మెక్ టియర్స్ సంస్థ ఈ వేలం వేయ‌గా కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఈ విస్కీ బాటిల్‌ను రూ.5 ల‌క్ష‌ల (ఆరు వేల పౌండ్లు)కు కొనుక్కున్నారు. ఊహించిన దానికంటే రెండింత‌లు ధ‌ర అధికంగా ప‌లికింద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

ఈ విస్కీ బాటిళ్ల‌ను ప‌రిమిత సంఖ్య‌లో ఆబర్దీన్ షైర్ ప్రాంతంలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ లింక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా త‌యారు చేశారు. ఈ విస్కీ బాటిల్ కవర్ పై డొనాల్డ్‌ ట్రంప్ ఆనాడు చేసిన‌ సంతకం కూడా ఉంది. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ అద్భుతంగా ఉంటుందని నిర్వాహ‌కులు పేర్కొన్నారు. ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఇప్పుడు ఈ విస్కీ ఇంత‌ ధ‌ర ప‌లికింద‌ని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News