balaiah: ‘శాత‌క‌ర్ణి’ క‌థ‌ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు క్రిష్‌లో ఓ త‌ప‌న‌, ఆవేశం చూశా!: బాల‌కృష్ణ‌


సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దాన‌వీర శూర‌క‌ర్ణ సినిమా విడుద‌లై 40 ఏళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా ‘గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి’ చిత్ర బృందం ఈ రోజు ఓ ప్ర‌త్యేక కార్యక్ర‌మంలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ  దాన‌వీర శూర‌క‌ర్ణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగుల‌ను గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో దాన‌వీర శూర‌క‌ర్ణ రికార్డులు నెల‌కొల్పిందని బాల‌కృష్ణ అన్నారు. తాను త‌న 100వ సినిమాగా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో న‌టించ‌డం భ‌గ‌వంతుడి లీల‌గా భావిస్తాన‌ని చెప్పారు. ఈ సినిమాకు అన్ని అంశాలు క‌లిసి వ‌చ్చాయ‌ని అన్నారు.

ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని బాలయ్య ప్ర‌శంసించారు. త‌న‌కు క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు క్రిష్‌లో తాను ఓ త‌ప‌న‌, ఆవేశం, అన్వేష‌ణ‌  చూశాన‌ని అన్నారు. క్రిష్ క‌ళ్ల‌లో ఆ త‌ప‌న‌ క‌నిపించింద‌ని చెప్పారు.  శాత‌కర్ణి విజ‌యం తెలుగువారి విజ‌యమ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ మాట్లాడుతూ... ఈ సినిమా ఒప్పుకున్నందుకు బాల‌కృష్ణ‌కు తాను ధ‌న్య‌వాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News