demonitisation: ‘మౌనంగా ఉండండి’... ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు మన్మోహన్‌ సింగ్ సలహా


పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ విచారణ చేపట్టి ఆర్థిక శాఖ అధికారులను ప‌లు ప్ర‌శ్న‌లు అడిగిన విష‌యం తెలిసిందే. అయితే స‌ద‌రు అధికారులు క‌మిటీకి ఎటువంటి స‌మాధానం ఇవ్వలేదు. కాగా, పెద్ద‌నోట్ల ర‌ద్దుకు సంబంధించి రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను కూడా ప్రశ్నించేందుకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ విషయంలో మాజీ ప్ర‌ధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయన‌కో స‌ల‌హా ఇచ్చారు.

పార్లమెంటరీ కమిటీ అడిగే ప్రశ్నలతో ఇబ్బందులు వస్తాయనుకుంటే స‌ద‌రు క‌మిటీ ముందు మౌనం పాటించవచ్చని మన్మోహన్‌సింగ్‌ సలహా ఇచ్చారట‌. గతంలో మ‌న్మోహ‌న్ సింగ్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన విష‌యం తెలిసిందే. ఆ అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని రిజ‌ర్వ్ బ్యాంక్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా జాగ్రత్త తీసుకోవాలని మ‌న్మోహ‌న్ చెప్పారు. ఆర్‌బీఐకి ఇబ్బంది కలిగే ఏ ప్రశ్నకు జ‌వాబు చెప్ప‌కూడ‌ద‌ని ఆయ‌న‌ సూచించారు.

  • Loading...

More Telugu News