samsung: ‘ఆయనను అరెస్టు చేయకండి’... శామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌కు ఊరటనిచ్చిన న్యాయస్థానం


దక్షిణ కొరియా అధ్యక్షురాలి అవినీతి కుంభకోణం కేసులో శామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్ జె యంగ్ లీ ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డానికి అక్క‌డి పోలీసులు కూడా స‌న్నద్ధ‌మ‌వుతున్న వేళ ఈ కేసులో ఆయ‌నకు ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో జె యంగ్ లీని అరెస్టు చేసేందుకు వారెంటు జారీ చేయాలని ప్రాసిక్యూషన్‌ కోరగా.. దీనిని ఆ దేశ న్యాయస్థానం తిరస్కరించింది. మ‌రోవైపు ఈ కేసులో ఆ దేశ‌ అధ్యక్షురాలిని పదవి నుంచి దించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతున్నాయి. ఈ కేసులో ఇరుక్కున్న శామ్‌సంగ్ తాము ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించింది. తాము విరాళాలు ఇచ్చినమాట వాస్తవమే కానీ తాము ఏమీ ఆశించలేదని ఆ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు పేర్కొన్నారు.
 
శామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్ జె యంగ్ లీ 2015లో సుమారు రూ.175 కోట్ల విలువైన న‌గ‌దును ప్రస్తుత అధ్యక్షురాలు పార్క్‌ జియోన్‌ హైస్‌కు చెందిన ఓ కంపెనీకి అక్ర‌మంగా మ‌ళ్లించారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News