nokia: నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్
మొబైల్ ఫోన్‌ల తయారీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధమైన నోకియా ఇటీవలే నోకియా–6 పేరుతో తమ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ చైనాలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా పీ1 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
5.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, అడ్రినో 540 గ్రాఫిక్స్ ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ , ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 22.6 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్, ఐపీ 57 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, క్విక్ చార్జ్ 4.0. ఈ స్మార్ట్ ఫోన్ ధరను మాత్రం నోకియా వెల్లడించలేదు.