kajal: మెగాస్టార్ చిరంజీవి సీనియ‌ర్ అనే ఫీలింగ్ నాకు క‌లుగ‌లేదు: హీరోయిన్‌ కాజ‌ల్


మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాలో తాను న‌టించినందుకు సంతోషంగా ఉంద‌ని హీరోయిన్ కాజ‌ల్ చెప్పింది. ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... చిరంజీవితో న‌టిస్తున్న‌ప్పుడు ఆయ‌న ఓ సీనియ‌ర్ అనే ఫీలింగ్ త‌న‌కు క‌లుగ‌లేదని వ్యాఖ్యానించింది. తాను గ‌తంలో రామ్ చ‌రణ్‌తో సినిమాలు చేసేట‌ప్పుడు చిరంజీవి కూడా ప‌లు సార్లు సెట్ లోకి వ‌చ్చి చూసేవార‌ని చెప్పింది. ఖైదీ నంబ‌ర్‌ 150లో ఆయ‌న‌తో క‌లిసి ఎటువంటి ఇబ్బందీ లేకుండా న‌టించాన‌ని తెలిపింది. టీవీ షోలు చూడ‌డం, పుస్త‌కాలు చ‌ద‌వడం త‌న హాబీల‌ని చెప్పింది. అప్పుడ‌ప్పుడు త‌నకు న‌చ్చిన వంట‌కాలు వండుకొని తింటాన‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News