jallikattu: జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం తాత్కాలిక విర‌మ‌ణ.. సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌


త‌మిళ‌నాడులో వారం రోజులుగా శాంతియుతంగా చేస్తోన్న జ‌ల్లిక‌ట్టు ఉద్యమం ఈ రోజు హింసాత్మ‌క రూపు దాల్చిన విష‌యం తెలిసిందే. మెరీనా బీచ్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో త‌మ పోరాటంపై ఉద్య‌మ సంఘాలు స్పందించాయి. జ‌ల్లిక‌ట్టు ఉద్యమాన్ని తాత్కాలికంగా విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అయితే, కాసేప‌ట్లో తాము స‌మావేశ‌మై త‌మ‌ ఉద్య‌మ కార్యాచ‌ర‌ణను ఈ రోజు సాయంత్రం ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపాయి. 

  • Loading...

More Telugu News