special status: మీ విధానాల వల్లే 1458 మంది తెలంగాణ యువకులు బలిదానాలు చేశారు.. ఇదేనా మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం నేర్పింది?: బీజేపీపై పవన్ కల్యాణ్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రేపు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో రాష్ట్ర యువత మౌన దీక్షను చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై జనసేనాని, సినీనటుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. 1997లో బీజేపీ ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిందని, అనంతరం అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయితే, మళ్లీ ప్రత్యేక తెలంగాణ ఊసును బీజేపీ ఎత్తలేదని అన్నారు. దాని పర్యవసానంగా నిండు నూరేళ్లు బతకాల్సిన 1458 మంది తెలంగాణ యువకులు బలిదానాలు చేశారని ఆయన అన్నారు. ఒక సున్నితమైన సమస్యని, అనేక కోట్ల మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యని 17 సంవత్సరాలు నాన్చి, 12 గంటల్లో తేల్చేశారని పేర్కొన్నారు. ఇదే నా మీరు చెబుతున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం మీకు నేర్పింది? అని ఆయన ప్రశ్నించారు.
#APDemandsSpecialstatus pic.twitter.com/5J9PKbfeIB
— Pawan Kalyan (@PawanKalyan) 25 January 2017