stalin dmk: ఆసక్తికర ఘటన.. పన్నీర్ సెల్వంకి దారి ఇచ్చిన స్టాలిన్‌


ప్రతిపక్ష నేతగా త‌మిళ‌నాడు కేబినెట్‌ మంత్రి హోదాలో ఉన్న స్టాలిన్ త‌న హోదాకు త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. త‌మ రాష్ట్ర ముఖ్యమంత్రి ప‌న్నీర్ సెల్వం హోదాని గౌరవిస్తూ ఆయన కాన్వాయ్‌కు దారిచ్చి అందరితో మ‌న్న‌న‌లు పొందుతున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఈ వార్త ప‌ట్ల అంద‌రూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. శాసనసభ సమావేశంలో పాల్గొనేందుకు నిన్న‌ ఉదయం తన నివాసం నుంచి కారులో ప్రతిపక్షనేత స్టాలిన్‌ బయలుదేరారు. స్టాలిన్ కారు వెంట సీఆర్‌పీఎఫ్‌ భద్రతా సిబ్బంది, శాసనసభ్యుల వాహనాలు ఉన్నాయి.

అయితే, అదే సమయంలో ఆళ్వారుపేట దాటిన తర్వాత పన్నీర్‌సెల్వం కాన్వాయ్ వ‌స్తోంది. ఆ విష‌యాన్ని గుర్తించిన‌ స్టాలిన్‌.. వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన నిలపాలని త‌న‌ డ్రైవరుకు చెప్పి, త‌మ భద్రతా సిబ్బంది, శాసన సభ్యులకు కూడా ఆ సూచ‌న‌లు చేశారు. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ఆ రోడ్డుపై వేగంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్లిపోయింది. అనంత‌రం స్టాలిన్‌తో పాటు శాసనసభ్యుల కార్లు అక్కడి నుంచి వెళ్లాయి.

  • Loading...

More Telugu News