gold rate: ఒక్కసారిగా పెరిగిపోయిన బంగారం ధర
మొన్న, నిన్న కిందికి వెళ్లిన బంగారం ధర ఈ రోజు ఒక్కసారిగా పైకి వచ్చేసింది. నిన్న పసిడి ధర ఏకంగా రూ.400 తగ్గి రూ.29,150కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ట్రేడింగ్లో రూ.230 పెరిగి రూ.29,380గా నమోదు కావడం విశేషం. బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు రావడంతో పసిడిధర పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధర కూడా రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 0.25 శాతం పెరిగి ఔన్సు 1,191.30 డాలర్లుగా నమోదు కాగా, వెండి కూడా 2.27 శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లకు చేరింది.