tamilnadu: త‌మిళ‌నాడులో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌రణాలు


త‌మిళ‌నాడులో రాజ‌కీయ స‌మీక‌రణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య‌మంత్రి అయ్యేందుకు శ‌శిక‌ళ పావులు క‌దుపుతున్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్‌ను అ పదవి నుంచి తప్పుకోవాలని ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం కోరడంతో ఆమె రాజీనామా చేశారు. మ‌రోవైపు శ‌శిక‌ళ‌తో చ‌ర్చించ‌డానికి పోయెస్ గార్డెన్‌కు అన్నాడీఎంకే నేత‌లు క్యూ క‌డుతున్నారు. కాగా, మ‌రో ఇద్ద‌రు అధికారులు కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. వారందరి రాజీనామాల‌ను ఆ రాష్ట్ర‌ప్ర‌భుత్వం కూడా ఆమోదించింది. 2014లో రిటైరైన షీలా బాలాకృష్ణన్‌ పై ఎంతో నమ్మకముండటంతోనే ఆమెను తన సలహాదారుగా అప్ప‌ట్లో జయలలిత నియమించుకున్నారు.

జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పుడు 75 రోజుల పాటు  పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్‌నే నిర్వ‌ర్తించారు. జయలలిత మ‌ర‌ణం అనంత‌రం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు ప్రస్తుతం ప్రాధాన్యం తగ్గిందని, ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్టు కూడా మ‌రోవాద‌న‌ వినిపిస్తోంది. రేపు అన్నాడీఎంకే శాస‌న‌స‌భప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని స‌మాచారం.  

  • Loading...

More Telugu News