rajamouli: అందుకే కొన్ని రోజుల పాటు రాజమౌళి ఫోన్ పక్కన పెట్టేశాడట!


అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళికి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వుంది. ఇక 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలు ఆయన కీర్తి ప్రతిష్ఠలను దేశవ్యాప్తంగా విస్తరింపజేశాయి. ఈ రెండు సినిమాలతో .. దేశంలో చెప్పుకోదగిన దర్శకుల జాబితాలో రాజమౌళి చేరిపోయారు.

 అంతే .. తమ తదుపరి సినిమాను రాజమౌళితో చేస్తే బాగుంటుందని బాలీవుడ్లో కొంతమంది కథానాయకులు భావించారు. మరికొందరు ఆయనకి టచ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో బాలీవుడ్ నుంచి రాజమౌళికి విపరీతంగా కాల్స్ వచ్చేవట. అవి రిసీవ్ చేసుకోకపోతే వరుసగా మెసేజ్ లు వస్తూనే ఉండేవట. ఈ బాధను భరించలేకనే ఆయన కొన్ని రోజుల పాటు ఫోన్ పక్కన పెట్టేశాడట. ఇక ఈ నేపథ్యంలో 'బాహుబలి 2' చూసి ఆయనని అభినందించడానికి ఫోన్ చేసిన వారికి నిరాశే ఎదురైనట్టుగా తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News