rana: 'నేనే రాజు నేనే మంత్రి' తమిళ వెర్షన్ వాయిదా?


రానా కథానాయకుడిగా తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఉండటంతో, ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోను రేపు విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే తమిళంలో ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఏ కారణంగా వాయిదా పడిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై ఈ సినిమా టీమ్ స్పందించాల్సి వుంది. ఒకవేళ వాయిదా పడటం నిజమే అయితే, కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఇక తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా తనకి మంచి క్రేజ్ తీసుకు వస్తుందని రానా భావిస్తున్నాడు. ఆయన అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.       

  • Loading...

More Telugu News