navazuddin siddiqui: కేసీఆర్ బయోపిక్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ?


తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురించి తెలియని వాళ్లుండరు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర .. సాధించిన విజయం మరిచిపోలేనివి. పట్టుదలకు .. కార్యదీక్షకు .. సమయస్ఫూర్తికి ప్రతీకగా కేసీఆర్ పేరు చెబుతారు. అలాంటి కేసీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించడానికి నిర్మాత మధుర శ్రీధర్ రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తికావడంతో, నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు. కేసీఆర్ పాత్రకి బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు తెరపైకి వచ్చింది. ఆయనైతేనే కేసీఆర్ పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడని నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.      

  • Loading...

More Telugu News