chaitu: సమంతాతో జోడీ కట్టడానికి ఆసక్తి చూపని చైతూ .. కారణం అదే!


దర్శకుడు మారుతి .. నాగచైతన్యతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతూ జోడీగా సమంతా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మారుతి వ్యక్తం చేశాడట. పెళ్లి తరువాత చైతూ .. సమంతా కలిసి చేసే సినిమా కనుక, ఒక రేంజ్ లో ఈ ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని ఆయన భావించాడు. అయితే అందుకు చైతూ ఆసక్తి చూపలేదనే టాక్ వినిపిస్తోంది.

 చైతూ .. సమంతా కాంబినేషన్లో 'ఏ మాయ చేశావే' .. 'మనం' వంటి హిట్స్ వున్నాయి. అది ఒక తీపి జ్ఞాపకంగా అలా ఉండిపోవడం మంచిదనేది చైతూ భావన. పెళ్లి తరువాత చేసిన సినిమా ఫలితం తేడా కొడితే ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కోవలసి వస్తుంది .. ఇదంతా అవసరమా? అంటూ చైతూ తన సన్నిహితుల దగ్గర అనాసక్తిని వ్యక్తం చేశాడట. ఈ మాటలను బట్టి ఇప్పట్లో ఈ జంట తెరపై కనిపించదనీ, ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News