vijay devarakonda: నాకెందుకో అది కరెక్ట్ కాదనిపిస్తోంది : విజయ్ దేవరకొండ
పాత తరం నుంచి కూడా సినిమాలకి ఒకరు కథను సిద్ధం చేస్తే .. మరొకరు స్క్రీన్ ప్లే ను సమకూర్చడం జరుగుతూ వుంటుంది. మరొకరు ఆ సినిమాకి సంభాషణలు అందిస్తారు. అప్పుడు ఆ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లిన దర్శకుడు చిత్రీకరణ చేపడతాడు. ఒకరు కథను తయారు చేయడంలో సిద్ధహస్తులైతే .. మరొకరు స్క్రీన్ ప్లే ను రెడీ చేయడంలో మంచి నైపుణ్యాన్ని కలిగి వుంటారు. అందువలన ఎవరు చేయవలసిన పనిని వాళ్లు చేస్తూ వెళ్లే వాళ్లు.
అయితే ఈ పద్ధతి తనకి కరెక్ట్ గా అనిపించదని విజయ్ దేవరకొండ అన్నాడు. ఒకరు రాసిన కథను మరొకరు తీయడంపై తనకి సదభిప్రాయం లేదని చెప్పాడు. ఎవరి దర్శకత్వంలో చేయడానికైనా తనకి అభ్యంతరం లేదనీ, కాకపోతే రచయితలైన దర్శకులతో కలిసి పనిచేయడానికి మరింత ఆసక్తిని చూపుతానని అన్నాడు. కథలో నుంచి వినోదం పుట్టడం .. నటులకంటే పాత్రలు కనిపించడం తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు.