chaitu: చైతూ, సమంతాల పెళ్లికి కుటుంబ సమేతంగా స్టార్ హీరోలు!
చైతూ .. సమంతాల వివాహ వేడుక అక్టోబర్ 6వ తేదీన గోవాలోని ఓ ఖరీదైన రిసార్ట్స్ లో జరగనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి పరిమిత సంఖ్యలోనే బంధువులను .. స్నేహితులను ఆహ్వానిస్తున్నారు. చైతూ .. సమంతా ఇద్దరూ కలిసి వెళ్లి మహేశ్ బాబు ఫ్యామిలీని .. ఎన్టీఆర్ ఫ్యామిలీని .. చరణ్ ఫ్యామిలీని ఆహ్వానించారట.
ఈ స్టార్ హీరోలు సమంతాతో సినిమాలు చేశారు. ముగ్గురికి కూడా అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం వుంది. అందువలన ఈ ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీస్ తో ఈ వివాహ వేడుకకు గోవా వెళ్లడం ఖరారైనట్టేనని అంటున్నారు. వివాహ వేడుక తరువాత మూడు రోజులకు హైదరాబాద్ లో భారీస్థాయిలో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారట. టాలీవుడ్ .. కోలీవుడ్ .. బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఈ ఫంక్షన్ కి హాజరు కానున్నట్టు తెలుస్తోంది.