vice president of india: హైదరాబాదులో వెంకయ్యనాయుడి పర్యటన.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. వివరాలు
- హైదరాబాదులో ఉప రాష్ట్రపతి పర్యటన
- ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
- సహకరించాలని వాహనదారులకు వినతి
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో వుంటారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, మూడు రోజుల పాటు ఆయన ప్రయాణించే సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
శనివారం:
- ఉదయం 9 గంటల నుంచి 10.15 వరకు బేగంపేట విమానాశ్రయం-విద్యానగర్ ల మధ్య
- 10.45 నుంచి 11.30 వరకు విద్యానగర్-ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్క్ మధ్య
- మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 వరకు ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్క్-రాజ్ భవన్ మధ్య
- సాయంత్రం 4.45 నుంచి 5.30 వరకు రాజ్ భవన్-బంజారాహిల్స్ రోడ్ నంబర్.12 మధ్య ఆంక్షలు అమల్లో ఉంటాయి.
- ఉదయం 9.45 నుంచి 10.30 వరకు బంజారాహిల్స్ రోడ్ నం.12-బేగంపేట్ ఎయిర్ పోర్ట్ మధ్య
- సాయంత్రం 4.30 నుంచి 5.15 వరకు బంజారాహిల్స్ రోడ్ నం.12-శిల్పకళా వేదిక మధ్య
- సాయంత్రం 5.45 నుంచి 6.30 వరకు శిల్పకళా వేదిక-బంజారాహిల్స్ రోడ్ నం.12 మధ్య ఆంక్షలు అమల్లో ఉంటాయి.
- ఉదయం 7.30 నుంచి 8.30 వరకు బంజారాహిల్స్ రోడ్ నం.12-బేగంపేట విమానాశ్రయం మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.