QR code: అతిపెద్ద క్యూఆర్ కోడ్ రూపొందించిన చైనీయులు!
- లక్షా ముప్పైవేల చెట్లతో ఏర్పాటు
- స్కాన్ కూడా చేసే అవకాశం
- పర్యాటక ఆకర్షణ కోసమే ఈ ప్రయత్నం
చైనాలో దాదాపు 75 శాతం ఆర్థిక లావాదేవీలు క్యూఆర్ కోడ్ ద్వారానే జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర చైనాలోని గ్జిన్‌లిన్‌షుయీ గ్రామంలో అతిపెద్ద క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. దీని కోసం లక్షా ముప్పైవేల చెట్లను ఉపయోగించారు. పర్యాటకులను ఆకర్షించడమే ధ్యేయంగా దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. చైనాలో విరివిగా కనిపించే జూనిపర్ చెట్లతో దీన్ని రూపొందించారు. మరో విషయం ఏంటంటే... ఈ పెద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ కూడా చేయొచ్చు. దీన్ని స్కాన్ చేస్తే స్థానిక టూరిజం వెబ్‌సైట్ వియ్‌చాట్ అకౌంట్‌కి కనెక్ట్ అవుతుంది. క్విక్ రెస్పాన్స్ కోడ్‌కి సంక్షిప్త రూపమే క్యూఆర్ కోడ్. దీని ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. అలాగే సంబంధిత వెబ్‌సైట్‌కి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చు. చైనాలో బైకులు, కార్లు అద్దెకు తీసుకోవడానికి, ఇవ్వడానికి కూడా క్యూఆర్ కోడ్లనే ఉపయోగిస్తుంటారు.