cricket: చెన్నై వన్డే: టపటపా రాలిపోయిన టీమిండియా టాప్ ఆర్డర్ వికెట్లు.. తీవ్ర ఒత్తిడిలో కోహ్లీసేన
- టీమిండియా స్కోరు 10 ఓవర్లకి 34/3
- కోహ్లీ, మనీష్ పాండే డకౌట్
- మూడు వికెట్లూ ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ ఖాతాలోనే
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతోన్న టీమిండియా, ఆస్ట్రేలియా మొదటి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. భారత బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అజింక్యా రహానే 3.3 ఓవర్ల వద్ద 5 పరుగుల వ్యక్తిగత స్కోరుకే అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 5.1 ఓవర్ల వద్ద ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఆ వెంటనే మనీష్ పాండే 5.3 ఓవర్ల వద్ద డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ రోహిత్ శర్మ 12, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేదర్ జాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా మూడు వికెట్లనూ ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ పడగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 10 ఓవర్లకి 34/3 గా ఉంది.