smart helmet: రూ. 1,15,000 విలువైన స్మార్ట్ హెల్మెట్
జపాన్‌కు చెందిన బార్డర్‌లెస్ అనే స్టార్టప్ కంపెనీ ఓ స్మార్ట్ హెల్మెట్‌ను తయారు చేసింది. దీని ధర అక్షరాలా రూ. 1,15,000. ఐరన్ మ్యాన్ సినిమాలో హెల్మెట్ లాగే ఇది పనిచేస్తుంది కాబట్టే దీనికి ఇంత ధర. దీనిలో ఉన్న వెనకవైపు కెమెరా సహాయంతో బైక్ నడుపుతూనే చుట్టూ 360 డిగ్రీల్లో ఏం జరుగుతుందో తల తిప్పకుండానే చూడొచ్చు. యాప్ ద్వారా పనిచేసే ఈ హెల్మెట్ సాయంతో గమ్యం చేరడానికి సరైన దారి, పట్టే సమయం, దారిలో ట్రాఫిక్ విషయాలను కూడా బైక్ నడుపుతూనే తెలుసుకోవచ్చు. ఇంకా ఇందులో హెడ్-అప్ డిస్ప్లే, సేఫ్టీ లైట్, టచ్ ఆపరేషన్, సౌండ్ కంట్రోల్, గ్రూప్ టాక్, మ్యూజిక్ ప్లేబ్యాక్, రైడ్ డేటా వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.