online retail store: ఆన్‌లైన్ నిత్యావసరాల బిజినెస్‌లోకి రానున్న టాటా గ్రూప్
- స్టార్‌క్విక్ పేరుతో మార్కెట్‌లోకి
- రెండు నెలల్లో విడుదల
- అమెజాన్, బిగ్‌బాస్కెట్‌లకు దెబ్బ
ఆన్‌లైన్ నిత్యావసరాల సరుకుల బిజినెస్‌లోకి టాటా గ్రూప్ రానున్నట్లు తెలుస్తోంది. టాటా, టెస్కో గ్రూపులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ట్రెంట్ హైపర్‌మార్కెట్ రిటైల్ చైన్ తరఫున `స్టార్‌క్విక్` పేరుతో ఆన్‌లైన్ నిత్యావసరాల స్టోర్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు నెలల్లోగా ఈ ఆన్‌లైన్ మార్కెట్ వెబ్‌సైట్, యాప్‌లను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ఇప్పటికే ఆన్‌లైన్ నిత్యావసరాల మార్కెట్‌లో ఉన్న అమెజాన్, బిగ్‌బాస్కెట్ వంటి వెబ్‌సైట్ల మీద దెబ్బ పడే అవకాశం ఉంది. దీని కారణంగా ఆన్‌లైన్ నిత్యావసరాల మార్కెట్‌లో పోటీ పెరిగి, వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే బిగ్‌బజార్ కూడా ఆన్‌లైన్ మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.