kadapa: మా అమ్మానాన్నలు వ్యభిచారం చేయమంటున్నారు: జిల్లా జడ్జిని ఆశ్రయించిన బాలికలు

  • కడపలో సిగ్గుపడే ఘటన
  • గాడి తప్పిన తల్లిదండ్రులు
  • తల్లిదండ్రుల నిర్వాకంతో పిల్లలపై ఒత్తిడి
  • జడ్జికి లేఖ రాసిన నలుగురు అక్కాచెల్లెళ్లు
  • చలించిపోయి స్పందించిన జడ్జి
  • కేసు నమోదు చేసి, వారిని కాపాడాలని ఆదేశం

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులే తమ జీవితాలను చేజేతులా నాశనం చేయాలని చూస్తున్నారంటూ నలుగురు బాలికలు జిల్లా జడ్జి జి. శ్రీనివాస్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జిల్లా జడ్జి శ్రీనివాస్ కు నలుగురు బాలికలు లేఖ రాశారు.

'మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. మేము బాగా చదువుకుంటున్నాం. అయితే మా అమ్మానాన్న మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అలాగే హమాలీగా పని చేసే మా నాన్న కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మా అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నవారు మమ్మల్ని కూడా వ్యభిచారం రొంపిలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తెస్తున్నారు.

అలాంటి జీవితం మాకు వద్దు. మేము బాగా చదువుకుని ప్రయోజకులం కావాలని ఉంది. మా అమ్మానాన్నలకి బుద్ధి చెప్పండి..సార్' అంటూ వేడుకున్నారు. ఈ లెటర్ చదివిన జడ్జి చలించిపోయారు. వెంటనే ఆ పిల్లల వివరాలు సేకరించాలని ఉమన్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ను ఆదేశించి, తల్లిదండ్రులు, అక్రమ సంబంధం పెట్టుకున్నవారు, ఒత్తిడి తెస్తున్న వారిపై కేసులు నమోదు చేయించారు. తక్షణం పిల్లలను ఆదుకోవాలని ఆదేశించారు. 

  • Loading...

More Telugu News