mexico: మెక్సికన్లను భయపెడుతున్న మరోముప్పు?.. హెచ్చరికలు జారీ!

  • భూంకంపం సమయంలోనే సంభవించిన భారీ పేలుడు
  • గ్యాస్ స్టేషన్ లో ఒక విభాగం పేలి ఉంటుందని అనుమానం
  • మెక్సికో నగర వీధుల్లో మంటలు పెట్టవద్దంటూ హెచ్చరికలు
  • మెక్సికో సిటీలో ప్రజల వంట గ్యాస్ అవసరాలు తీర్చేందుకు భారీ పైప్ లైన్
  • భూకంపంతో రోడ్డున పడ్డ ప్రజలు



మెక్సికో నగరంలోని ప్రధాన ప్రాంతాలను భారీ భూకంపం నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా కూడు, గూడు, గుడ్డ లేక మెక్సికన్లు నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో మెక్సికన్లను హెచ్చరిస్తూ ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికో పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మంటలు పెట్టవద్దని సూచించింది. ఎందుకంటే, మెక్సికో ప్రజల వంట గ్యాస్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం భారీ గ్యాస్‌ పైప్‌ లైన్ ఏర్పాటు చేసింది. గత నెలలో వచ్చిన భూకంపం ధాటికి ఇది కొంత ధ్వంసమైంది.

భూకంప సమయాల్లో ఆటోమేటిక్ గా మూసుకుపోయే వాల్వులు ఉన్నప్పటికీ గ్యాస్ పైప్ లైన్ కు ఏదైనా నష్టం వాటిల్లితే పెను ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది. తాజాగా భూకంపం సంభవించిన సమయంలో భారీ పేలుడు కూడా జరిగింది. ఈ పేలుడు గ్యాస్ స్టేషన్ నుంచేనని స్థానికులు పేర్కొంటున్నారు. దీని కారణంగా లేదా భూకంపం కారణంగా లీకులు ఏర్పడితే, మెక్సికన్లు రోడ్డు మీద వంటలు వండితే అవి అంటుకుని పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే మెక్సికో మేయర్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. 

  • Loading...

More Telugu News