Six Women: ఒకే రకం దుస్తులు ధరించి వచ్చిన ఆరుగురు మహిళలు.. ఒకరిని చూసి మరొకరు నోరెళ్లబెట్టిన వైనం!
- ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సంఘటన
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో
- ఆరుగురు ఒకే కలర్, ఒకే స్టైల్ డ్రెస్సుల్లో అనుకోకుండా కలుసుకున్న వైనం
కొత్త దుస్తులు వేసుకుని మనం ఎక్కడికైనా వెళితే అక్కడ అచ్చం మనలాంటి దుస్తులే వేరొకరు కూడా ధరించి కనపడితే ‘వావ్.. సేమ్ టూ సేమ్’ అంటూ మురిసిపోతాం. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా అరుదు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఇటువంటి సంఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిడ్నీలో జరుగుతోన్న పెళ్లి వేడుకకు వెళ్లిన ఓ మహిళ తనలాంటి డ్రెస్ వేసుకుని వచ్చిన మరో మహిళను చూసింది.
అయితే, కాసేపటికే అచ్చం అలాంటి డ్రెస్సునే వేసుకుని మరో నలుగురు మహిళలు వచ్చారు. మొత్తం ఆరుగురు మహిళలు ఒకే కలర్, ఒకే స్టైల్లో ఉన్న డ్రెస్సులను వేసుకుని అనుకోకుండా ఇలా కలుసుకోవడం పార్టీలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఆ ఆరుగురు మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆరుగురు కలిసి పెళ్లికూతురితో ఫొటో దిగి తమ ఫేస్బుక్ ఖాతాల్లో పోస్ట్ చేసుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది.