eden garden: ఆసీస్ తో రెండో వన్డే... వరుణుడు కరుణించేనా?
- ఈడెన్ గార్డెన్స్ లో రెండో వన్డే
- కోల్ కతాలో వర్షం
- రద్దయిన ప్రాక్టీస్ సెషన్
- మ్యాచ్ జరుగుతుందన్న గంగూలీ
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న రెండో వన్డేపై వరుణుడు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముంబైని భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కోల్ కతాలో కూడా గత కొంత కాలంగా వర్షాలు వదలడం లేదు. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన రెండో వన్డే జరుగుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్ లో ముందంజవేసిన టీమిండియాను ఓడించి టోర్నీని రక్తికట్టించాలని ఆసీస్ భావిస్తోంది. ఈ వన్డేలో కూడా విజయం సాధించడం ద్వారా ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని, తద్వారా సిరీస్ పై పూర్తి పట్టు సాధించాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.
మరోవైపు వర్షాల కారణంగా రెండు జట్లు ప్రాక్టీస్ లో పాల్గొనలేదు. ఈ క్రమంలో నేటి మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఈడెన్ గార్డెన్స్ లో అత్యున్నత సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని, మ్యాచ్ ను నిర్వహిస్తామని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.