Sushma Swaraj: మెక్సికోలో మనవాళ్లందరూ సేఫ్: సుష్మ


మెక్సిలోని భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్టు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. మెక్సికోలోని రాయబారితో మాట్లాడానని, అక్కడి భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్టు చెప్పారని సుష్మ వివరించారు.

బుధవారం మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 1.1 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి 225 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాలు కుప్పకూలాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఓ ఎలిమెంటరీ స్కూలు భవనం కూలిన ఘటనలో 21 మంది చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. 1985 భూకంపం తర్వాత పెను విధ్వంసం సృష్టించిన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు.

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 72వ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న సుష్మ మాట్లాడుతూ మెక్సికో భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News