jagan: కార్టూనిస్ట్ మోహన్ మృతిపై జగన్ దిగ్భ్రాంతి

  • మోహన్ సేవలు చిరస్మరణీయమన్న జగన్
  • గొప్ప కార్టూనిస్టుల కోవకు చెందినవారంటూ కితాబు
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మోహన్ భౌతికకాయం
ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు పత్రికా చరిత్రలో గొప్ప కార్టూనిస్టుల కోవకు చెందినవారు మోహన్ అని ఆయన తెలిపారు. పలు దినపత్రికల్లో కార్టూనిస్టుగా పని చేసిన మోహన్... దశాబ్దాల పాటు అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు. మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు, ఆయన భౌతికకాయాన్ని ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు తరలించనున్నారు.
jagan
ysrcp
cartoonist mohan
jagna condolences to cartoonist mohan

More Telugu News