aob: భయం గుప్పిట్లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ నేతలకు నోటీసులు

  • ఏవోబీలో మావోస్టుల వార్షికోత్సవాలు
  • జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు
  • కొనసాగుతున్న వాహనాల తనిఖీలు
  • ప్రభుత్వ కార్యాలయాలకు భద్రత
అనునిత్యం భయం గుప్పిట్లో ఉండే ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు పార్టీ 13వ వార్షికోత్సవం జరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రాంతం వేడెక్కింది. పోలీసు బలగాలు, ప్రత్యేక బలగాలు బోర్డర్ కు చేరుకున్నాయి. అరకులోయ చుట్టు పక్కల ప్రాంతంతో పాటు, సరిహద్దుల్లో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

జోలాపుట్టు, కుమడ, డుడుమ తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు కొనసాగాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.
aob
andhra odisha boarder
coumbing in aob
maoist plenary

More Telugu News