vijay devarakonda: ఎంతో కష్టపడే ఈ స్థాయికి వచ్చాను : విజయ్ దేవరకొండ
- విజయ్ దేవరకొండకి పెరుగుతోన్న క్రేజ్
- రెమ్యునరేషన్ పెంచాడనే వార్తలు
- ఈ స్థాయి క్రేజ్ తేలికగా దక్కలేదు
- తన నిర్ణయం సరైనదే
'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత 'పెళ్లి చూపులు' .. 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. ఆయనని సంప్రదిస్తోన్న దర్శక నిర్మాతల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. మరో రెండు మూడేళ్ల వరకూ ఆయన డైరీ ఖాళీ లేదు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పారితోషికం పెంచేశాడనీ, షాప్ ఓపెనింగ్స్ కు .. వ్యాపార ప్రకటనలకు భారీ మొత్తం అడుగుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఆయన చెవికి చేరడంతో తనదైన శైలిలో స్పందించాడు. షాప్స్ ఓపెనింగ్స్ .. వ్యాపార ప్రకటనల విషయానికి వస్తే, నచ్చని వాటిని వద్దని చెప్పలేక భారీ రేటు చెప్పి అవతలి వాళ్లు వెనక్కి తగ్గేలా చేస్తున్నానని అన్నాడు. ఇక పారితోషికం విషయానికొస్తే, తాను ఈ స్థాయికి తేలికగా వచ్చేయలేదని చెప్పాడు. ఎంతో శ్రమకోర్చి .. సాధన చేసి ఎదిగానని అన్నాడు. అందువలన పారితోషికం పెంచాలనే తన నిర్ణయం సరైనదేనన్నట్టుగా చెప్పుకొచ్చాడు.