court: కోర్టు సాక్షిగా క్లయింట్ ను తన్ని తరమేసిన లాయర్లు..వీడియో చూడండి
- చలానా కేసు సెటిల్ మెంట్ కి 5000 ఫీజు తీసుకున్న లాయర్లు
- పని చేయని లాయర్లను నిలదీసి ఫీజు వాపస్ చేయమన్న క్లయింట్
- ఆగ్రహానికి గురైన లాయర్ జూనియర్లతో దాడి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
కోర్టు సాక్షిగా తమ క్లయింట్ ను లాయర్లు తన్ని తరిమేసిన ఘటన కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్, రాంపూర్ లోని కోర్టులో ఇద్దరు లాయర్లు ఒక వ్యక్తిని కాలితో తన్నారు. వారి నుంచి తప్పించుకుని అతను పారిపోతుండగా, మరో లాయర్ లాగి కొట్టాడు. దీనిని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయింది.
ఇంతకీ ఎందుకు అలా లాయర్లు దాడి చేశారని ఆరాతీయగా, ఆ వ్యక్తి చలానా సెటిల్ మెంట్ కోసం ఒక లాయర్ కు 5000 రూపాయల ఫీజు చెల్లించాడు. అయితే ఫీజు తీసుకున్న ఆ లాయర్ అతనికి ఎలాంటి సహాయమూ చేయలేదు. దీంతో తాను ఇచ్చిన ఫీజు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు లాయర్ కోర్టు ప్రాంగణంలోనే తన జూనియర్లతో కొట్టించాడు. సీనియర్ దగ్గర మరింత పేరు కొట్టేయడం కోసం లాయర్లు రెచ్చిపోయారు. పారిపోతున్నా పరుగెత్తించి మరీ తన్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. అయితే అతను ఫీజు చెల్లించలేదని, అందుకే అతనిపై దాడి చేశామని లాయర్లు చెప్పడం కొసమెరుపు.