ind vs aus: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, రహానే!


కోల్ కత్తాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా కదులుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ రోహిత్ శర్మ (7) పెవిలియన్ చేరాడు. అనంతరం మరో ఓపెనర్ రహానేకు కెప్టెన్ కోహ్లీ జతకలిశాడు. వారిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా స్కోర్ బోర్డును ముందుకు ఉరికించారు.

ఈ క్రమంలో కోహ్లీ, రహానే ఇద్దరూ హాఫ్ సెంచరీలను సాధించారు. 60 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో కోహ్లీ 50 పరుగులను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో వన్డేల్లో తన 45వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు, రహానే 62 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో తన 20వ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరూ కలసి ఇప్పటివరకు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు. 

  • Loading...

More Telugu News