japan open super series: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో క్వార్టర్స్‌కి చేరుకున్న శ్రీకాంత్, ప్రణయ్
- హాంకాంగ్ క్రీడాకారుడు హు యున్‌పై విజయం సాధించిన శ్రీకాంత్
- తైపీ క్రీడాకారుడు సు జెన్ హవ్పై విజయం సాధించిన ప్రణయ్
- మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమి పాలైన భారత జట్టు
జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్ ఫైనల్స్‌కి చేరుకున్నారు. వరల్డ్ నెం. 8 ర్యాంకులో ఉన్న శ్రీకాంత్, హాంకాంగ్‌కి చెందిన హు యున్‌పై 21-12, 21-11 తేడాతో విజయం సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సన్తో శ్రీకాంత్ పోటీ పడనున్నాడు.
మరోవైపు హెచ్ఎస్ ప్రణయ్, తైపీకి చెందిన జెన్ హవ్పై 21-16, 23-21 తేడాతో విజయం సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో చైనా క్రీడాకారుడు షి యూకీతో తలపడనున్నాడు. ఇక భారత్ తరఫున మిక్స్డ్ డబుల్స్ లో పోటీ పడుతున్న అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి బాగానే ఆడినప్పటికీ 27-29, 21-16, 12-21 తేడాతో ఇండోనేషియా నాలుగో సీడ్ ప్రవీణ్ జోర్డాన్, డెబ్బీ సూశాంటోల జోడీ చేతిలో ఓడిపోయారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు, తన చిరకాల ప్రత్యర్థి నోజోమీ ఒకుహారా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.