shirdi sai: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త.. విమాన సర్వీసులకు సిద్ధమైన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్


షిర్డీ సాయి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. సాయి దర్శనానికి వెళ్లే భక్తులకు అతి త్వరలో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. షిర్డీలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్  ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సాయి భక్తులు ఇక నేరుగా షిర్డీలో వాలిపోవచ్చు.

 ప్రస్తుతం సాయి దర్శనానికి విమానంలో వెళ్లాలంటే ముంబై, ఔరంగాబాద్ వెళ్లి అక్కడి నుంచి మళ్లీ రైలును కానీ, బస్సును కానీ ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఆ కష్టాలు ఇక తప్పినట్టే. షిర్డీకి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాక్డీ గ్రామంలో రూ.350 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. మొత్తం 400 హెక్టార్లలో నిర్మించిన ఈ విమానాశ్రయ బాధ్యతలను మహారాష్ట్ర విమానాశ్రయ సంస్థ చూసుకుంటోంది.

  • Loading...

More Telugu News