pakistan: అజిత్ ధోవల్ వ్యూహాలు పారనీయం: పాకిస్తాన్
- అజిత్ ధోవల్ ను లక్ష్యం చేసుకున్న పాక్
- ధోవల్ పై ఆరోపణలు చేసిన దాయాది దేశం
- భారత్ అణచివేస్తోందని గగ్గోలు
పాకిస్థాన్, చైనాలకు దీటుగా భారత్ స్పందించడం వెనుక జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రచించిన వ్యూహాలే కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ ఆత్మరక్షణలో పడగా, డోక్లాంను హస్తగతం చేసుకుందామని భావించిన చైనా తీవ్రంగా భంగపడింది. ఈ నేపథ్యంలో అజిత్ ధోవల్ ను లక్ష్యం చేసుకుని ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత సభ్యుడు టిపు ఉస్మాన్ విమర్శలు చేశారు.
ప్రాంతీయంగా భారత్ కు ఆధిపత్యం తీసుకొచ్చేందుకు అజిత్ ధోవల్ రచిస్తున్న ప్రమాదకర రక్షణ వ్యూహాలు, ఇతర దేశాలను అణచివేసే ధోరణి ఎన్నటికీ ఫలించవని ఆయన అన్నారు. కశ్మీరీల మనోభావాలు, వారి పరిస్థితులను ప్రపంచానికి చాటేందుకు ప్రయత్నించిన పాక్ ప్రధాని అబ్బాసీని విమర్శించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కశ్మీరీల దురవస్థను ప్రపంచం అర్థం చేసుకుంటుందని ఆయన అన్నారు. కశ్మీర్ లో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన భాద్యత భారత్ పైనే ఉందని ఆయన అన్నారు. పాక్ ను అణచివేయాలన్న భారత్ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని ఆయన అన్నారు.