india: భారత్ విచ్చేయనున్న అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్
- వచ్చే వారం మోదీతో సమావేశం
- ట్రంప్ అధికారంలో మొదటి అధికారిక కేబినెట్ స్థాయి సమావేశం
- రక్షణ సంబంధాల బలోపేతానికి కృషి
భారత్ - అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అమెరికా రక్షణ శాఖ మంత్రి జిమ్ మాటిస్ భారతదేశం విచ్చేయనున్నట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రకటించింది. వచ్చే వారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చలు జరపనున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి కేబినెట్ స్థాయి అధికారిక సమావేశంగా ఇది ప్రాధాన్యత సంతరించుకోనుంది. సెప్టెంబర్ 26న రానున్న మాటిస్ ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద జరగనున్న ఓ వేడుకలో పాల్గొననున్నారు. ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్‌సన్‌తో దైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.