pak: మీ దేశంలో సదస్సు పెడతారా?: పాక్ కు షాక్ ఇచ్చిన సార్క్ దేశాల మంత్రులు
- ఐరాస సర్వసభ్య సమావేశాల్లో సార్క్‌దేశాల మంత్రుల భేటీ
- ఒంటరి అయిపోయిన పాకిస్థాన్
- సార్క్ సమిట్‌కు తమ దేశం ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తోందన్న పాక్
- పాక్ లో సదస్సు నిర్వహించే పరిస్థితులు లేవన్న సభ్యదేశాల ప్రతినిధి
న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సార్క్‌దేశాల మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో భారత మంత్రి సుష్మా స్వరాజ్ కూడా పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశంలో పాకిస్థాన్ ఒంటరి అయిపోయింది. ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ త్వరలో సార్క్ సమిట్‌కు తమ దేశం ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే ఇతర దేశాల ప్రతినిధులు 'పాక్‌లో సమావేశం ఏంటీ?' అన్నట్లు చూశారు.
తరుచూ ఉగ్రదాడులు జరుగుతోన్న ఆ దేశంలో సమావేశం పెడితే అక్కడికి వెళ్లే ప్రతినిధుల ప్రాణాలకే ముప్పు అని వ్యాఖ్యానించారు. సభ్యదేశాల ప్రతినిధి అయిన ఒకరు స్పందించి పాకిస్థాన్‌లో సదస్సు నిర్వహించే పరిస్థితులు లేవని కుండ బద్దలు కొట్టారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొనాలని చెప్పారు. దీంతో పాకిస్థాన్ ప్రతినిధి ఏమీ మాట్లాడలేకపోయారు.