మోదీ: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తృతస్థాయి భేటీ.. మోదీ, అమిత్ షా హాజరు
- ఢిల్లీలో కొనసాగుతోన్న సమావేశం
- బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు
- రాహుల్ గాంధీ అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారు: అమిత్ షా
- ఉగ్రవాదంపై జీరో టోలెరెన్స్: నితిన్ గడ్కరీ
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మరో రెండు గంటల పాటు సాగనుంది. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇందులో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. తమ పార్టీపై రాహుల్ గాంధీ అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... దేశంలో ఉగ్రవాదం అనేది చాలా కాలం నుంచి ఉన్న సమస్యగా అభివర్ణించారు. తమకు ఉగ్రవాదంపై జీరో టోలెరన్స్ ఉందని చెప్పారు. మరికాసేపట్లో ప్రధాని మంత్రి మోదీ ప్రసంగించనున్నారు.