shiridi international airport: షిరిడీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను ఆవిష్కరించనున్న రాష్ట్రపతి
- ముంబై, హైద్రాబాద్‌లకు విమాన సర్వీసులు
- అలయన్స్ ఎయిర్‌తో ఒప్పందం చేసుకున్న ఎమ్ఏడీసీ
- అనంతరం సాయిబాబా మహా సమాధి శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్న రామ్‌నాథ్
వచ్చే ఆదివారం షిరిడీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. అదే రోజు షిరిడీ నుంచి ముంబై వరకు వెళ్లే విమానాలను కూడా ప్రారంభించనున్నట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. విమానాశ్రయం ఆవిష్కరణ అనంతరం శ్రీ సాయి బాబా ట్రస్టు వారు నిర్వహించే సాయి బాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల కోసం షిరిడీ ఆలయానికి రాష్ట్రపతి వెళ్లనున్నట్లు సమాచారం.
విమానాశ్రయానికి సంబంధించిన వాణిజ్య కార్యకలాపాలు కూడా అదే రోజు ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎమ్ఏడీసీ) ఎండీ సురేష్ కాకాని తెలిపారు. షిరిడీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి ముందుగా అలయన్స్ ఎయిర్ వారి భాగస్వామ్యంతో ముంబైకి నాలుగు విమానాలను నడపనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే హైద్రాబాద్‌కి సర్వీసులను నడిపే యోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు.