harbhajan singh: క్లార్క్! ఆస్ట్రేలియా పరిస్థితి ఏమీ బాగోలేదు... మళ్లీ నువ్వు రావాలి!: హర్భజన్ సింగ్ సూచన

  • క్లార్క్ ని క్రికెట్ లోకి పునఃప్రవేశం చేయమని సూచన 
  • ఆసీస్ బ్యాటింగ్ లో పసతగ్గింది
  • పేలవ ప్రదర్శనతో ఆసీస్ పై విమర్శలు
  • వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్లార్క్

 అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ఆసీస్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ క్లార్క్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలు కావడంతో ఆ జట్టుపై విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో దిగ్గజంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టేనా ఇది? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ, 'మైకేల్ క్లార్క్.. నువ్వు తిరిగి ఆటను ప్రారంభించాలని నేను కొరుకుంటున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ లో ప్రతిభగల బ్యాట్స్ మన్ రాక తగ్గింది' అన్నాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ లో నాణ్యమైన బ్యాట్స్ మన్ లేరని చెప్పాడు. అందుకే రిటైర్మెంట్‌ కి విరామం ప్రకటించి ప్రస్తుత ఆసీస్‌ జట్టులో మళ్లీ నువ్వు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపాడు.

కాగా, ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరుతెచ్చుకున్న క్లార్క్ కెరీర్ పీక్ లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ తో సిరీస్ కు వ్యాఖ్యాతగా క్లార్క్ వ్యవహరిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News