army: సరికొత్త క్షిపణులకు ఆర్డర్ ఇచ్చిన భారత సైన్యం

  • ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను తాకే ఎంఆర్- శామ్ క్షిపణులు
  • డీఆర్డీఓ కు ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ
  • ఒప్పందంపై సంతకాలు జరిగాయన్న సైనికాధికారులు

భూ ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను పేల్చి వేయగల సత్తా ఉన్న అత్యాధునిక క్షిపణులను భారత సైన్యం ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్ లోని డీఆర్డీఓతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, శాస్త్రవేత్తలు ఈ సరికొత్త క్షిపణులను సైన్యానికి అందించనున్నారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డీఆర్డీఓ, ఇండియన్ ఆర్మీ మధ్య సంతకాలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మీడియం రేంజ్ సర్ఫేస్ యూ ఎయిర్ మిసైల్ (ఎంఆర్-శామ్) క్షిపణులు త్వరలోనే సైన్యం అమ్ముల పొదిలోకి చేరనున్నాయని తెలిపింది. వీటిని సముద్రంపై ఉండే యుద్ధ నౌకల నుంచి, ఉపరితల బేస్ ల నుంచి ప్రయోగించ వచ్చని, గాల్లోని లక్ష్యాలను జీపీఎస్, రాడార్ ల సాయంతో గుర్తించి ఇవి నాశనం చేస్తాయని, సరిహద్దుల్లో, సముద్రం పై నుంచి వచ్చే విధ్వంసక క్షిపణులను ఇది గాల్లోనే అడ్డుకుంటుందని వెల్లడించారు.

చూడటానికి చిన్నగా ఉండే ఇవి, ప్రయోగించగానే, తమంతట తాముగా లక్ష్యం వైపు దూసుకెళతాయని, కచ్చితమైన పనితీరును చూపుతాయని తెలిపారు. ఒక్కో క్షిపణి తయారీకి రూ. 6 కోట్లు ఖర్చవుతుందని, ఈ ధర చాలా చౌకేనని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఈ సంవత్సరం మార్చి నుంచి డీఆర్డీఓ ఎంఆర్ - శామ్ ప్రాజెక్టును మొత్తం రూ. 10 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ క్షిపణుల తొలి కస్టమర్ గా భారత ఆర్మీయే నిలిచింది.

  • Loading...

More Telugu News