yeswant sinha: కేంద్రమే చేజేతులా దేశ అర్థిక వ్యవస్థను నాశనం చేసింది: బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు

  • కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మండిపడ్డ యశ్వంత్ సిన్హా
  • దేశ ఆర్థిక పరిస్థితిని కేంద్రమే నట్టేట ముంచింది
  • కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపై ఉసిగొల్పడం సరికాదు 
  • నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను తప్పుబట్టిన యశ్వంత్  

బీజేపీ సీనియర్ నేత, వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన యశ్వంత్ సిన్హా సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ' ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ' పేరిట ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు రాసిన కథనంలో నోట్లరద్దు, జీఎస్టీపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వమే దేశ ఆర్థిక వ్యవస్థను నట్టేట ముంచిందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన తప్పులపై ఇంకా స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస‍్మరించినట్లేనని ఆయన ఆ కథనంలో అభిప్రాయపడ్డారు. సాక్షాత్తూ కేంద్రప్రభుత్వం చేసిన ఈ భారీ తప్పిదం వల్ల సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆయన చెప్పారు.

జీడీపీ తగ్గడానికి కారణం సాంకేతిక కారణాలన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము ప్రతిపక్షంలో ఉండగా దర్యాప్తు సంస్థల దాడులను తీవ్రంగా ఖండిచేవారమని గుర్తు చేసిన ఆయన, అధికారం అండతో దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపైకి ఉసిగొల్పటం సరికాదని ఆయన ఆ కథనంలో సూచించారు. దీనిపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పదిస్తూ, 'అధికారంలో ఉన్నవారి గురించి యశ్వంత్ వాస్తవాలు వెల్లడించారు. మరి ఈ వాస్తవాలను అధికారం అంగీకరిస్తుందా?' అని ఆయన వరుస ట్వీట్లతో ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News