telangana dgp: పోలీస్ శాఖలో త్వరలో 26 వేల పోస్టులు భర్తీ!: డీజీపీ అనురాగ్ శర్మ
- పోలీసులంటే ప్రజల్లో భయం పోవాలి
- భారీ ఎత్తున నియామకాలను చేపట్టబోతున్నాం
- పోలీసు శాఖలో మహిళలకు మరింత ప్రాధాన్యత
త్వరలోనే పోలీస్ శాఖలో 26 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 33 శాతం మంది మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనాలను పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో పోలీసులంటే భయాన్ని పోగొట్టేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. గోదావరిఖనిలో రూ. 4.5 కోట్లతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ భవనానికి డీజీపీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.