fidget spinner: ప్రపంచంలో మొదటి ఫిడ్జెట్ స్పిన్నర్ ఫీచర్ ఫోన్... భారత్‌లో విడుదల
- తయారు చేసిన హాంకాంగ్ కంపెనీ
- ధర రూ. 1200 - 1300
- జీపీఎస్ టెక్నాలజీ కలిగిన మరో ఫీచర్ ఫోన్ కూడా విడుదల
హాంకాంగ్‌కు చెందిన మొబైల్ టెక్నాలజీ కంపెనీ చిల్లీ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ భారత మార్కెట్‌లోకి కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. `కే118` మోడల్‌గా పిలిచే ఈ ఫీచర్ ఫోన్ ప్రపంచంలోనే మొదటి ఫిడ్జెట్ స్పిన్నర్ ఫీచర్ ఫోన్‌గా నిలిచింది. చేతిలో ఇమిడే పరిమాణంలో ఫిడ్జెట్ స్పిన్నర్‌లా తిప్పుకునే సౌకర్యం ఉంది. 280 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో అన్ని రకాల ఫీచర్ ఫోన్ సౌకర్యాలు గల ఈ ఫోన్ ధర రూ. 1200 - 1300 ఉంది.
దీంతో పాటు `ఎఫ్05` పేరుతో మరో ఫీచర్ ఫోన్‌ను కూడా చిల్లీ ఇంటర్నేషనల్ కంపెనీ విడుదల చేసింది. ఇందులో జీపీఎస్ సౌకర్యం ఉంది. దీని ధర రూ. 1500 - 1700గా ఉంది. ఈ రెండు ఫోన్లు ఆన్‌లైన్లోనూ, ఆఫ్‌లైన్లోనూ కొనుగోలు చేసే సదుపాయం ఉంది. ఒక్కో వెబ్‌సైట్‌లో ఒక్కో ధరతో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.