9 members: అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అలజడి... ఏఎంసీలో 9 మంది మృతి
- నిన్నటి వరకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రోగులు
- పరిస్థితి విషమించడంతో సర్కారు ఆసుపత్రికి తరలించిన ప్రైవేటు ఆసుపత్రి
- ఘటనపై కామినేని శ్రీనివాస్ ఆరా
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అలజడి చెలరేగింది. ఏఎంసీలో 9 మంది రోగులు మృతి చెందారు. వారంతా రాత్రి నుంచి ఏఎంసీలో చికిత్స పొందినట్టు, మృతులంతా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులని తెలుస్తోంది. ఆ రోగులంతా నిన్నటి వరకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నట్లు, పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది... ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
వీరి మృతిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీశారు. పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ ఆసుపత్రిలో రోగులకు తగినంత మంది వైద్యులు లేరని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. రోగుల మృతిపై ఆ ఆసుపత్రి అధికారులు విభిన్న వాదనలు వినిపిస్తున్నారు.