Yingluck Shinawatra: థాయ్లాండ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు..!
- బియ్యం సబ్సిడీలో అవకతవకలు
- కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ధనం తరలించారని ఆరోపణలు
- ఆమె ఎక్కడ ఉన్నారో తెలుసన్న ప్రస్తుత ప్రధాని
బియ్యం సబ్సిడీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న థాయ్లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవ్రత నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల జైలు శిక్షకు గురయ్యారు. అంతేకాదు ఆమె జైలు శిక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని థాయ్లాండ్ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బియ్యం సబ్సిడీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఆమె జైలు శిక్షకు గురవడానికి కారణం.
షినవ్రత కోర్టు విచారణలకు ఎప్పుడూ హాజరు కాలేదు. అంతేకాక ఆమె దేశంలో లేదు, విదేశాల్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎక్కడ ఉన్నదీ తనకు తెలుసని, అయితే ఇంతకుమించిన వివరాలను తాను చెప్పలేనని ప్రధాని ప్రయుత్ చాన్-ఓచా మీడియాకు తెలిపారు.
షినవ్రత ప్రభుత్వాన్ని 2014లో తిరుగుబాటు ద్వారా కూల్చివేశారు. రైస్ సబ్సిడరీలో ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ధనాన్ని ధారపోసినట్టు ఆరోపణలున్నాయి. ఆమె అవినీతి కారణంగా 8 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.